G. Kishan Reddy: బీజేపీ తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడై ప్రజల కోసం పనిచేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆరంభం మాత్రమే అన్నారు.
NVSS Prabhakar: గెలిచిన అభ్యర్థులను చెప్పమనండి రేవంత్ రెడ్డి వల్లే గెలిచామని NVSS ప్రకభార్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుని బలమైన శక్తిగా ఎదిగిందన్నారు.
ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ట్విటర్(ఎక్స్) ద్వారా అభినందనలు తెలియజేశారు.
Traffic Diversions: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. జూన్ 2న హైదరాబాద్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలకు రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న (గురువారం) ట్రాఫిక్ పోలీసులు మళ్లింపు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ఎదురుగా గన్పార్క్, ట్యాంక్బండ్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ తదితర…
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు.
ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు.
"జయ జయహే తెలంగాణ" గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్న ఆవిష్కరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.