Dharmasthala Case: కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ‘ధర్మస్థల’ ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ సామూహిక ఖనన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది.