ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను తాజాగా ప్రకటించింది. మార్చి 27వ తేదీన జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి.. రికార్డు స్థాయిలోనే కేవలం 27 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేయడం విశేషమే. ఇక గ్రూప్ వన్ పరీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకొనగా., పరీక్ష రాసిన వాళ్లలో కేవలం 4,496 మందిని గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత సాధించారు అభ్యర్థులు. ఇక…
తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల లిస్ట్ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. గతేడాది జూలైలో గ్రూప్-4 పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. 8,810 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. 7 లక్షల 26 వేల 837 మంది అభ్యర్థుల ర్యాంకింగ్ లను ప్రకటించింది. అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో ర్యాంకులు చూసుకోవాలని సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సెలక్ట్ అయిన వారి షార్ట్ లిస్ట్ ను…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈరోజు (డిసెంబర్ 8) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు 2023 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ — upsc.gov.in లో ఫలితాలను చూసుకోవచ్చు.. ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షను సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు నిర్వహించారు.. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే? Step 1: అధికారిక వెబ్‌సైట్ — upsc.gov.in ని సందర్శించండి Step 2: హోమ్ పేజీలో,…
ఢిల్లీలో రాజ్యసభ బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఎన్టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మాత్రం ఉండదని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎన్నికల్లో ఫలితాలను నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ప్రభావం ఇంకో రాష్ట్రంపై పెద్దగా ఉండదని జీవీఎల్ చెప్పారు. తెలంగాణలో వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. తెలంగాణలో కనీసం 14 లోక్ సభ స్థానాల్లో గెలిచేలా బీజేపీ…
తెలంగాణతో తమ బంధం విడదీయరానిది.. రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ పని చేస్తూనే ఉంటుందని ప్రధాని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిందని అన్నారు. కాగా.. బీజేపీ మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతోందని, దానిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తూనే ఉంటామని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులకు ఎదురుదెబ్బ తగిలింది. అందులో ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ క్రమంలో మాజీ టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ లో, పద్మావతి కోదాడలో ముందంజలో ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కొడంగల్‌లో ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 5687 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో మూడో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. కొడంగల్, కామారెడ్డిలో మూడో రౌండ్‌లో రేవంత్‌రెడ్డికి లీడ్ లో కొనసాగుతున్నారు. కొడంగల్‌లో 4159 ఓట్లు, కామారెడ్డిలో 2354 ఓట్ల ఆధిక్యంలో రేవంత్‌రెడ్డి ఉన్నారు.
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో రెండో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. రెండో రౌడ్‌లో గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు 2800 ఓట్ల ఆధిక్యం ఉంది. మధిరలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 4,137 ఓట్ల ఆధిక్యంలో భట్టి విక్రమార్క ఉన్నారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థికి 145 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఇబ్రహీంపట్నంలో రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.