యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈరోజు (డిసెంబర్ 8) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు 2023 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ — upsc.gov.in లో ఫలితాలను చూసుకోవచ్చు.. ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షను సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు నిర్వహించారు..
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే?
Step 1: అధికారిక వెబ్‌సైట్ — upsc.gov.in ని సందర్శించండి
Step 2: హోమ్ పేజీలో, ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: కొత్త పేజీ PDF రూపంలో తెరవబడుతుంది.
Step 4: PDF లో మీ రోల్ నంబర్ కోసం శోధించండి.
Step 5: PDF ని డౌన్‌లోడ్ చేయండి మరియు భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి..
రిజల్ట్ PDFలో రోల్ నంబర్‌లను పేర్కొన్న అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ మరియు ఇతర సెంట్రల్ సర్వీసెస్ (గ్రూప్ ‘A’ మరియు గ్రూప్ ‘B’) ఎంపిక కోసం పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కి అర్హత సాధించారు… ఈ అభ్యర్థుల పర్సనాలిటీ టెస్ట్‌ల (ఇంటర్వ్యూ లు) తేదీలు నిర్ణీత సమయంలో తెలియజేయబడతాయి.. వీటిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ధోల్‌పూర్ హౌస్, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ-110069లో నిర్వహించబడతాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లు తెలుస్తుంది..