స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. నోయిడా, ఘజియాబాద్‌ల నుంచి ఢిల్లీ వైపు వచ్చే భారీ వాహనాల ప్రవేశంపై సోమవారం రాత్రి నుంచి ఆగస్టు 15 వరకు ఆంక్షలు ఉంటాయని, ఈ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తామని ఆదివారం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు.