Twisha Sharma : కుళ్ళిపోతున్న టాలీవుడ్ హీరోయిన్ డెడ్ బాడీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మే 12న భోపాల్‌లో ట్విషా ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆమె అంత్యక్రియలు జరగలేదు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని భోపాల్‌లోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదంటూ కుటుంబ సభ్యులు, లాయర్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మార్చురీలో ఉన్న ట్విషా మృతదేహం కుళ్ళి పోతోందని ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మృతదేహాన్ని వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని కోరుతూ ట్విషా కుటుంబ సభ్యులకు పోలీసులు అధికారికంగా ఒక లేఖ పంపారు.
కోర్టు ఆదేశిస్తే రెండోసారి పోస్టుమార్టం నిర్వహించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ ప్రక్రియకు తాము పూర్తిగా సహకరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసు విచారణలో దర్యాప్తు సంస్థల తీరుపై ట్విషా తరపు న్యాయవాది అంకుర్ పాండే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసును తప్పుదోవ పట్టించేలా, నిందితులకు అనుకూలంగా మార్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్విషా మెడపై ఉన్న స్పష్టమైన గాయాల గురించి ఎయిమ్స్ వైద్యులు ఎందుకు సరైన వివరాలు సేకరించలేదని లాయర్ అంకుర్ ప్రశ్నించారు. మరణానికి ముందు ఆ గాయాలు ఎలా అయ్యాయన్న అసలు నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మృతదేహాన్ని ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచేందుకు తగిన సాంకేతిక వసతులు తమ వద్ద లేవని భోపాల్ ఎయిమ్స్ యాజమాన్యం అంగీకరించినట్లు లాయర్ తెలిపారు. నిందితుల ప్రమేయం వల్లే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పోస్టుమార్టం రికార్డుల్లో ట్విషా ఎత్తు విషయంలో నమోదైన వివరాలు కేసుపై మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
Also Read
- Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో 'ఇరుముడి'.. ఆ మార్క్ సాధ్యమేనా?
- Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!