PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
- ఇటలీలో కొనసాగుతోన్న ప్రధాని మోడీ పర్యటన
- మెలోనితో కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- కాశీ-రోమ్ శాశ్వతనగరాలన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోమ్-కాశీ.. ఈ రెండు నగరాలు సంస్కృతి, నాగరికతలకు కాలాతీత కేంద్రాలని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఇటలీలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాని మెలోనితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. అంతేకాకుండా రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ‘‘రోమ్ను శాశ్వతనగరం అని పిలుస్తున్నారు. అలాగే నా లోక్‌సభ నియోజకవర్గం వారణాసి (కాశీ)ని కూడా అలాగే పిలుస్తారు. రెండు నాగరికతలు కలిసినప్పుడు చర్చలు ఒక అజెండాకు పరిమితం కావు. చర్చలు చరిత్ర లోతుల్లోకి వెళ్తాయి. గత మూడున్నరేళ్లలో ప్రధాని మెలోనీని చాలాసార్లు కలిసే అవకాశం లభించింది. ఇది భారత్-ఇటలీ మధ్య నిరంతర సహకారాన్ని సూచిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
తనకు, తన ప్రతినిధి బృందానికి లభించిన ఘన స్వాగతానికి మెలోనికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఇక రోమ్-కాశీ నగరాల సంస్కృతులు కలిసినప్పుడు.. ఆత్మీయత, అనుబంధం సహజం అని పేర్కొన్నారు. భారత్-యూరోపియన్ యూనియన్ ఒప్పందం కుదరడానికి మద్దతు ఇచ్చినందుకు ఇటలీకి మరోసారి ధన్యవాదాలు చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వ్యాపారాలు వీలైనంత త్వరగా లబ్ధి పొందేలా ఇరు దేశాలు వేగంగా కృషి చేస్తాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, అంతరిక్షం, పౌర అణుశక్తి వంటి రంగాల్లో భారత్-ఇటలీలు అపారమైన అవకాశాలను చూస్తున్నాయన్నారు. ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంపొందించడానికి, సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు భారత్-ఇటలీ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నాయని మోడీ ప్రకటించారు.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
మెలోని..
ప్రధాని మోడీ ఇటలీ పర్యటన చారిత్రాత్మకం అని, సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. ‘‘మన రెండు దేశాల మధ్య సంబంధాలకు ఇది ఒక చారిత్రాత్మక దినం అని నేను గట్టిగా నమ్ముతున్నా. ఈ రోజున ఇక్కడ రోమ్‌లో మోడీకి, ఆయన ప్రతినిధి బృందానికి స్వాగతం పలకడం నాకు గౌరవంగా, ఆనందంగా ఉంది. నా మిత్రుడు నరేంద్ర మోడీ 2014 నుంచి భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నారు. కానీ ఈ రోజు ఇటలీలో ఇది ఆయన మొదటి ద్వైపాక్షిక పర్యటన. దీనికి ముందు ఒక భారత ప్రధాని ద్వైపాక్షిక పర్యటన చేసింది 2000వ సంవత్సరంలో. అంటే 26 సంవత్సరాల క్రితం. ఈ రోజు ఈ పర్యటనతో మనం ఈ అంతరాన్ని పూడ్చడమే కాకుండా.. మన సంబంధాలను పునరుజ్జీవింపజేయాలని కలిసి నిర్ణయించుకున్నాం. మన మధ్య సంబంధాలను అత్యున్నత స్థాయికి బలోపేతం చేయడానికి, మనం దృఢ సంకల్పంతో కలిసి నిర్మించుకున్న మార్గానికి ఈ పర్యటన శిఖరాగ్రం కాబోతుంది.’’ అని మెలోని పేర్కొన్నారు.
Addressing the joint press meet with PM Meloni of Italy. @GiorgiaMeloni https://t.co/IxLpD5fFVA
— Narendra Modi (@narendramodi) May 20, 2026
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!