Mega 158: డాడీ కోసం పెద్ది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా #Mega158 (#ChiruBobby2) చిత్రాన్ని కన్నుల పండువగా ప్రారంభించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రేపు (గురువారం) ఉదయం సరిగ్గా 8 గంటలకు పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. మాస్ నాడి తెలిసిన దర్శకుడు బాబీ, ఈసారి మెగాస్టార్‌ను మునుపెన్నడూ చూడని పవర్ ఫుల్ మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.
ఈ మెగా లాంచ్ ఈవెంట్‌కు ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేయనున్నారు. రామ్ చరణ్ రాకతో ఈ వేడుకకు మరింత గ్లామర్, క్రేజ్ రావడం ఖాయం. ముఖ్యంగా తన లేటెస్ట్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ రగ్గడ్ టచ్‌తో చరణ్ తన ఎలక్ట్రిఫైయింగ్ ప్రెజెన్స్‌తో ఈ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. ఒకే వేదికపై మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌ను చూసే అవకాశం రానుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువలలో ఎక్కడా రాజీ పడకుండా పాన్-ఇండియా రేంజ్లో ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లను రంగంలోకి దించారు. ఎస్. థమన్ (S Thaman) తన మార్క్ మాస్ బీట్స్‌తో థియేటర్లను దద్దరిల్లించే బాధ్యత తీసుకున్నారు. ‘జైలర్’ ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ తన అద్భుతమైన విజువల్స్‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నారు. అవినాష్ కొల్లా ఈ ప్రాజెక్ట్‌కు గ్రాండ్ సెట్స్, భారీ ఆర్ట్ వర్క్ సమకూర్చనున్నారు. రేపు జరగబోయే పూజా కార్యక్రమాలతో ఈ మెగా ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కనుంది. ఈ ఈవెంట్ నుంచి వచ్చే ఫొటోలు, వీడియోల కోసం సోషల్ మీడియాలో అప్పుడే మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ మొదలుపెట్టేశారు!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు