అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై ఆదివారం ఇరానీ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ డ్రా అయింది. లక్నోలోని ఇకాన్ స్టేడియం వేదికగా జరిగిన ఇరానీ కప్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేసింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఐదో రోజు ముంబై స్కోరు రెండవ ఇన్నింగ్స్‌లో 329/8 ఉంది. దీంతో.. ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు.…