ఢిల్లీ మద్యం కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయకపోవడంపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు. సీఎం కుర్చీ నుంచి తనను తప్పించేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు అనేక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖను తమిళిసై పంపారు. చెన్నై సెంట్రల్ నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
తన రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. మూడేళ్ల కింద చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడంపై గంటా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీనామా ఆమోదంలో ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ గంటా పిటిషన్ వేశారు. అంతేకాకుండా.. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో గంటా శ్రీనివాస్ పిటిషన్ ఈనెల 29న విచారణకు రానుంది.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్‌లో పెట్టిన స్పీకర్.. ఇప్పుడు ఆమోద ముద్ర వేయడంపై గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు.
కేశినేని నాని వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం.. విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. తన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. కాగా.. కేశినేని రాజీనామా అంశంపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. కేవలం ఎంపీ పదవి కోసం…
దాడి వీరభద్రరావు రాజీనామాపై ఐటీ మంత్రి అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదని అన్నారు. వైసీపీలో గెలిచే వారికి సీట్లు, కాంప్రమైజ్ కన్విన్స్ ఉండదని తెలిపారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ స్పష్టంగా చెప్పిందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారని తెలిపారు. టికెట్లు రాని వ్యక్తులు పార్టీకి దూరంగా ఉండటం వల్ల…
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా.. తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించేందుకు పార్లమెంట్ కు వెళ్లారు. అక్కడ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామాను సమర్పించారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పీకర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు.
కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పయనిస్తుండటంతో ఆయన రాజీనామా చేయడానికి రాజ్ భవన్‌కు వెళతారని సమాచారం.
BIG Breaking: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలు ప్రకటించే అభ్యర్థుల జాబితాపై ఆయా పార్టీల్లో అంతర్గత వివాదం నెలకొంది. టికెట్ రాని నేతలు మీడియా ముందు, అనుచరుల ముందు రోదిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.