సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీనామా, కొత్త పార్టీ అనే చర్చ ఈ రోజు లేదని… మీ అందరి ఆలోచన ఏంటో తనకు తెలుసు అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు టీఆర్ఎస్‌లోకి వెళ్లే ఉద్దేశం లేదని.. బీజేపీలోకి వెళ్లే మాటే లేదని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలతో ఆయన అన్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే తనతో ఎంతమంది వస్తారని ఆయన అడిగారు.…
ఏపీలో వైసీపీ గుర్తుతో గెలిచినా.. నిత్యం సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై లోక్‌సభ ఎంపీ ఓంబిర్లాను కూడా వైసీపీ ఎంపీలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని… అయినా వారి…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలతో పాటు నాగబాబు రాజీనామాను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ తిరస్కరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. సాధారణ ఎన్నికలను తలపించాయి. విష్ణు ప్యానెల్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నువ్వా నేనా అనేలా పోటీ పడ్డాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఎట్టకేలకు విష్ణు మంచు అండ్…
ఈటల రాజేందర్ రాజీనామాను కాసేపటి క్రితమే తెలంగాణ స్పీకర్ ఆమోదించారు. రాజీనామాని ఆమోదిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ఇవాళ ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన ఈటల.. అనంతరం అసెంబ్లీకి వెళ్లి.. అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను అందజేశారు.. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలేఖను సమర్పించారు ఈటల రాజేందర్. ఈటల రాజీనామాపై గంట వ్యవధిలోనే స్పందించిన తెలంగాణ స్పీకర్..వెంటనే ఆమోద ముద్ర వేశారు. ఈ…