PIB Fact Check: ప్రస్తుతం భారతదేశంలో చెలామణిలో ఉన్న 500 రూపాయల నోట్లు వచ్చే ఏడాది మార్చి వరకు దశల వారీగా నిలిచిపోతాయంటూ కొనసాగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఓ ఛానల్‌కు సంబంధించిన యూట్యూబ్ వీడియోలో ఆర్‌బీఐ రూ.500 నోట్ల చెలామణిని 2026 మార్చి నాటికి బంద్ చేస్తారన్న అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పుకొచ్చింది. ఈ ఫేక్ ప్రచారం పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టింది. “ఆర్‌బీఐ అలాంటి ప్రకటన ఏం చేయలేదు.. రూ.500 నోట్లు నిలుపుదల కావు, అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి అని వెల్లడించింది.
Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన విషయాలు.. నష్టాన్ని బయటపెట్టిన అధికారులు…!
అయితే, చాలా రోజుల నుంచి ఇలాంటి అసత్య వార్తలు ప్రసారం అవుతున్నాయి.. ప్రజలు ఎవరు కూడా ఈ ఫేక్ న్యూ్స్ ను నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం విజ్ఞప్తి చేసింది. ఏదైనా వార్తను నమ్మడం, మరొకరికి షేర్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి సరైనా సమాచారం ధ్రువీకరించుకోవాలని ప్రజలకు ఫ్యాక్ట్ చెక్ విభాగం సూచించింది.
Is the ₹500 note set to be phased out by 2026? 🤔
A #YouTube video on the YT Channel 'CAPITAL TV' (capitaltvind) falsely claims that the RBI will discontinue the circulation of ₹500 notes by March 2026.#PIBFactCheck
✔️@RBI has made NO such announcement.
✔️₹500 notes have… pic.twitter.com/NeJdcc72z2
— PIB Fact Check (@PIBFactCheck) June 3, 2025