రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. రూల్స్ పాటించని బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతు లైసెన్స్ లను రద్దు చేస్తుంది. భారీగా జరిమానాలను విధిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర బ్యాంక్ ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు బిగ్ షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని కారణంగా భారీ ఫైన్ వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.75 లక్షల జరిమానా విధించింది.
Also Read:Shraddha Das : అందాలతో ఘాటు పెంచేసిన శ్రద్ధా దాస్..
కేవైసీ (KYC)కి సంబంధించి 2016లో ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించని కారణంగా హెచ్‌డీఎఫ్‌సీపై ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ అండ్ సింధు బ్యాంకుపై కూడా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఈ బ్యాంకుకు రూ. 68 లక్షల ఫైన్ విధించింది. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడం, ఆర్థిక చేరిక మార్గదర్శకాలను నివేధించడంలో విఫలమైనందుకు ఈ బ్యాంకుపై ఫైన్ విధించింది. ఈ రెండు బ్యాంకులపై తీసుకున్న ఈ చర్య ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం చూపించదని ఆర్బీఐ స్పష్టం చేసింది.