కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలలో జాప్యం జరిగిన ‘రిపబ్లిక్’ మూవీ, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న జనం ముందుకొచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిన సాయితేజ్ నటించిన ఈ సినిమా గురించి మెగాభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు… ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇటు సినిమారంగంలో అటు రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించాయి. దాంతో సినీ, రాజకీయ ప్రముఖుల దృష్టి…