సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ స్పెషల్ గా ట్వీట్ చేశారు. “సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో అంతా అని ఆశిస్తూ, ఆ చిత్రం యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలలో జాప్యం జరిగిన ‘రిపబ్లిక్’ మూవీ, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న జనం ముందుకొచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిన సాయితేజ్ నటించిన ఈ సినిమా గురించి మెగాభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు… ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇటు సినిమారంగంలో అటు రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించాయి. దాంతో సినీ, రాజకీయ ప్రముఖుల దృష్టి…