మ్యూజిక్ డైరెక్టర్‌గా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ (DSP), ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంతో డీఎస్పీ నటుడిగా తెరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇందులో దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్షి’ అనే డప్పు కళాకారుడి పాత్రలో పరిచయం చేశారు. మునుపెన్నడూ చూడని విధంగా పొడవాటి జుట్టు, గడ్డం, మాస్ లుక్‌లో…