Yellamma : ‘ఎల్లమ్మ’లో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యూజిక్ డైరెక్టర్‌గా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ (DSP), ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంతో డీఎస్పీ నటుడిగా తెరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇందులో దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్షి’ అనే డప్పు కళాకారుడి పాత్రలో పరిచయం చేశారు. మునుపెన్నడూ చూడని విధంగా పొడవాటి జుట్టు, గడ్డం, మాస్ లుక్‌లో దేవిశ్రీ కనిపిస్తున్న తీరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Also Read : Spirit : ‘స్పిరిట్’లో విలన్‌గా ఆయనేనా..?
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఈ సినిమా కథ ప్రధానంగా తెలంగాణ సంస్కృతిలో భాగమైన ‘రేణుక ఎల్లమ్మ’ గ్రామ దేవత చుట్టూ, జానపద కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగనుంది. వేణు యెల్దండి సుమారు మూడేళ్ల పాటు శ్రమించి ఈ ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేశారు. గతంలో నాని, నితిన్ వంటి హీరోల పేర్లు వినిపించినా, చివరికి దేవిశ్రీ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో దేవిశ్రీ ప్రసాద్ క్యారెక్టర్ మునుపెన్నడూ చూడని విధంగా, చాలా షాకింగ్‌గా ఉంటుందట. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జానపద కళలను, సామాజిక అంశాలను గుండెకు హత్తుకునేలా చూపిస్తూ ‘బలగం’ మ్యాజిక్‌ను వేణు మళ్ళీ రిపీట్ చేస్తారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!