Nushrratt Bharuccha: ప్రముఖ నటి నుష్రత్ భరూచా ఇటీవల ఉజ్జయినిలోని శ్రీ మహాకాలేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. మహాకాళేశ్వరుడి భస్మ హారతిలో ఆమె పాల్గొన్నారు. ఆయల పూజారులు ఆమెను శాలువాతో సత్కరించారు. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశ్యంతో నుష్రత్ ఆలయాన్ని సందర్శించారు.
మహారాష్ట్ర ఎస్పీ అధ్యక్షుడు అబూ అజ్మీ.. మొఘల్ చక్రవరి ఔరంగజేబ్ గొప్ప పాలకుడని, క్రూరుడు కాదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వివాదం ముదరడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందువల్ల ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.