మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త చట్టంలోని అంశాలను అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో స్త్రీ శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి ఉన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ బరేలీకి చెందిన ఓ జంట మత మార్పిడికి పాల్పడ్డారు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం ఓ ఆశ్రమంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు బలవంతపు మత మార్పిడిపై వీరిద్దరూ పోలీస్ స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
మతమార్పిడి ఇలాగే కొనసాగితే దేశంలోని మెజారిటీ జనాభా మైనారిటీలుగా మారతారని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఉత్తరప్రదేశ్ అంతటా ఎస్సీ/ఎస్టీ, ఆర్థికంగా పేదవారిని క్రైస్తవ మతంలోకి అక్రమంగా మార్చడం పెద్ద ఎత్తున జరుగుతోందని కోర్టు పేర్కొంది.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. ఒక మహిళ మతాన్ని మార్చేందుకు ఓ జంట ఘోరంగా వ్యవహరించింది. అంతే కాకుండా మహిళపై తన భార్య ముందే సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి ఘటనలో 42 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేద, గిరిజన ప్రజల్ని క్రైస్తవ మతంలోకి మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
మత మార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్‌పై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది.
బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇవి దేశభద్రతకు, మతస్వేచ్ఛకు పెనుసవాల్ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వీటిని అరికట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో కృషిచేయాలని సుప్రీం ఆదేశించింది.