ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. ఇప్పుడు ప్రముఖ సంస్థ రిలయన్స్ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - రిలయన్స్ మధ్య ఒప్పందం కుదిరింది.. ఆంధ్రప్రదేశ్ లో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులపై రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది..