తమిళనాడులోని కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో 10 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వరద నీటిలో ఓ అరుదైన భారీ శ్వేత నాగు కొట్టుకొచ్చింది. దానిని చూసి భయాందోళనకు గురైన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు.