రేపటి నుంచి ఏపీలో ఆంక్షలను సడలించబోతున్నారు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సడలలింపు సమయాన్ని పెంచుతూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాజిటివిటీ 5 శాతం కంటే తక్కువగా ఉన్న 8 జిల్లాల్లో సడలింపుల సమయాన్ని సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచారు. పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. జులై 1 నుంచి 7 వరకు సడలించిన…
డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్టయ్యింది. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయన్న హెచ్చరికలతో.. మరోసారి లాక్‌డౌన్ ఆంక్షలను కఠినం చేసింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రూపొందించిన ఐదు దశల్లో.. మొదటి రెండు దశలను రద్దు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇకపై అన్ని జిల్లాల్లో మూడో దశలో విధించే ఆంక్షలు అమలు కానున్నాయి. దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంచనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. దీనికి…