రేపటి నుంచి ఏపీలో ఆంక్షలను సడలించబోతున్నారు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సడలలింపు సమయాన్ని పెంచుతూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాజిటివిటీ 5 శాతం కంటే తక్కువగా ఉన్న 8 జిల్లాల్లో సడలింపుల సమయాన్ని సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచారు. పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. జులై 1 నుంచి 7 వరకు సడలించిన నిబంధనలు అమలలో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. సడలించిన జిల్లాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.