PAK vs AFG: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు, క్రికెటర్లు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఓ కొలిక్కి వచ్చింది.
China Statement Nepal Crisis: నేపాల్‌లో కొనసాగుతున్న గందరగోళం, తిరుగుబాటుపై చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌లోని అన్ని పార్టీలు సమిష్టిగా ఉండి.. దేశీయ సమస్యలను పరిష్కరించుకోవాలని, సామాజిక క్రమం, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని చైనా కోరింది. నేపాల్ పరిస్థితిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తొలిసారి మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. "చైనా, నేపాల్ దేశాలు సాంప్రదాయక, స్నేహపూర్వక పొరుగు సంబంధాలను కలిగి ఉన్నాయి.
భారతదేశంతో ఉద్రిక్తత మధ్య, పాకిస్థాన్ చైనాతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిని పాకిస్థాన్ తన విజయాలలో ఒకటిగా భావిస్తోంది. వాణిజ్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా అనేక కీలక రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి పాకిస్థాన్ అంగీకరించింది. పాకిస్థాన్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం చైనాలో వాంగ్ యితో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సమావేశం తర్వాత చైనాతో వాణిజ్య ఒప్పందం ప్రకటించారు.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి చైనా ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో తాము అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. ఈ మేరక తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చైనా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగ్‌యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం…