CM Chandrababu: అభివృద్ధి జరిగితేనే భూముల ధరలకు రెక్కలు వస్తాయి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఒకప్పుడు హైదరాబాద్‌లోని కోకాపేటలో రూ.10,000 విలువ చేసే ఎకరం భూమి… ఇప్పుడు రూ.170 కోట్లకు చేరిందని గుర్తు చేశారు.. జూబ్లీహిల్స్‌లో ఒక్కప్పుడు రాళ్లు, రప్పలు ఉండేవి.. కానీ, ఒక హైటెక్ సిటీ కట్టి.. ముందు అడుగు వేశాం.. మౌలిక సదుపాయాలు కల్పించాం.. ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే.. ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందన్నారు.. అభివృద్ధి…
ఆర్ఆర్ఆర్ అంచనా వ్యయం రూ.18,772 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. రూ.300 కోట్లతో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల నేషనల్ హైవే పూర్తి చేస్తామని వెల్లడించారు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెళ్లేవారికి సిగ్నల్ ఫ్రీ రోడ్ అవుతుందన్నారు.. పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్ గురుంచి తాను మాట్లాడ దాల్చుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయం లో వాళ్ళ కన్నా ఎక్కువ మాకు ఉందని స్పష్టం చేశారు.…
జలసౌధలో కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. జిల్లాలో పెండింగ్ పనులు, అభివృద్ధి ప్రతిపాదనలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాగాలాండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సమీక్షిస్తున్నారు.