Regina Cassandra: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపై పడింది. ఇటీవలే ఆహా ఓటిటీలో అన్యాస్ ట్యుటోరియల్ తో వచ్చి భయపెట్టిన ఆమె తాజాగా శాకినీ డాకినీ చిత్రంతో నవ్వించడానికి రెడీ అయిపోయింది. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.