ఒక్క విగ్రహావిష్కరణ అధికారపక్షం నేతల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణ ఖమ్మం జిల్లాలో చినికి చినికి గాలి వానగా మారుతోంది. టీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాలు బాహా బాహికి గత రాత్రి దిగగా.. ఆ దాడుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ద్రోహం చేసిన వ్యక్తి రేగా అంటూ మాజీ ఎంఎల్ఎ పాయం ఆరోపిస్తుండగా పొంగులేటి పార్టీ బయటకు వెళ్లి పర్యటనలు చేయాలని రేగా కాంతారావు అంటున్నాడు.…
టీఆర్ఎస్ నేత, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకుముందు తన పర్యటనల్లో ప్రభుత్వ అధికారులపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఉద్యోగం చేస్తారా ఇంటికెళతారా అని మండిపడ్డారు. తాజాగా పార్టీలోని కొందరు నేతల్ని ఆయన టార్గెట్ చేశారు. నేను గ్రామాల్లో పర్యటించినప్పుడు పక్కా టీఆర్‌ఎస్‌లో కొనసాగే నాయకులు మాత్రమే పాల్గొనండి. రెండో ఆలోచన చేసేవారికి ఇక నుంచి ఫోన్లు రావు. పినపాక…
తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది… ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిపై జీడివాగు వద్ద రేగా కాంతారావు కారు బోల్తా పడింది… బైక్‌ని ఓవర్ టెక్ చేయబోయిన సమయంలో.. కారు అదుపుతప్పి చెట్టుకుని ఢీకొట్టింది.. ఆ తర్వాత రోడ్డుకిందకి దూసుకెళ్లి బోల్తా పడింది.. ఈ సమయంలో కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. అయితే, ప్రమాదం సమయంలో కారులో రేగా కాంతారావు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.