రాజకీయాల్లో నేతల మధ్య మాటల యుద్ధం రక్తికడుతూ వుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న చేసిన కామెంట్లు మంటలు రాజేస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం రచ్చబండలో చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అది కూడా ప్రొఫెసర్ జయశంకర్ సొంతూళ్ళు మాట్లాడడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. రెడ్లకు పగ్గాలివ్వాలంటూ వివిధ రాజకీయ పార్టీలకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. మీ పార్టీలు గెలవాలన్న.. రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల…