తూర్పుగోదావరి జిల్లాలో శ్రీగంధం చెట్లను అక్రమంగా కొట్టుకుపోయి విక్రయిస్తున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ కి చెందిన ముగ్గురు సంచార జీవనం గడిపే యువకులు ఈ అక్రమ రవాణా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు ముగ్గురినీ అరెస్టు చేశారు. రాజానగరం, కోరుకొండ మండలాల్లో మూడు చోట్ల శ్రీగంధం చెట్లను నరికి తరలిస్తుండగా.. పోలీసులకు అందిన సమాచారంతో రంగంలోకి దిగినట్లు రాజానగరం సీఐ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు. ఎస్సై ప్రేమ్…