జమ్మూ కాశ్మీర్ లో నెమ్మనెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి. గతంలో టెర్రరిస్టులకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించే వారు అక్కడి ప్రజలు. గ్రామాల్లో షెల్టర్ తీసుకుంటూ సైన్యం, పోలీసులు, అమాయక ప్రజలపై దాడులు చేసేవారు. అయితే తాజాగా ఆదివారం రోజు కాశ్మీర్ లోని ఓ గ్రామం ప్రజలు ఇద్దరు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలకు పట్టించారు. రియాసి జిల్లా తుక్సాన్ గ్రామ ప్రజలు ఆయుధాలతో ఉన్న ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి రెండు ఏకే రైఫిళ్లు,…