హైదరాబాద్‌లోని టీ-హబ్ ఇన్నోవేషన్ హబ్ నుంచి ఉద్భవించిన ప్రాప్‌టెక్ స్టార్టప్ ‘నియర్ ఎస్టేట్’.. రియల్ ఎస్టేట్ రంగంలో మరో ఘనత సాధించింది. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ (రియల్ వ్యూ 360°) వర్చువల్ టెక్నాలజీలో 2000 ప్లస్ లిస్టింగ్‌లను అధిగమించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లపై బలమైన దృష్టితో నియర్ ఎస్టేట్ అత్యాధునిక వర్చువల్ రియాలిటీ (విఆర్), జియోస్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించి.. నివాస, వాణిజ్యపరమైన ఆస్తులను కొనుగోలుదారులు, ఎన్ఆర్ఐ, పెట్టుబడిదారులు ఎలా గుర్తించాలో మూల్యాంకనం చేసే…