మర్డర్.. ఆ తర్వాత విదేశాలకు చెక్కేయడం.. ఇద్దరూ కలిసి సహజీవనం చేయడం.. ఇలా అంతా ప్లాన్ చేసుకున్నారు ఐశ్వర్య, తిరుమల రావు. కానీ తేజేశ్వర్ మర్డర్ తర్వాత అంతా రివర్స్ అయింది. వారి ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. దీంతో ఇద్దరూ ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. కొత్త పెళ్లికూతురు ఐశ్వర్య.. ఆమెతో వివాహేతర బంధం పెట్టుకున్న ప్రియుడు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు ఇద్దరూ దేశ ముదుర్లేనని తెలుస్తోంది..