ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్‌ను గెలవలేదు. 2016లో ఫైనల్ చేరినా తృటిలో టైటిల్ మిస్ అయింది. ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్ ఓడి ఇంటిదారి పట్టింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ఆర్‌సీబీ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కీలక ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 31వ తేదీలోపు ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది.…