ఐపీఎల్ 2025 మెగా వేలం మరికొన్ని రోజుల్లో జరగనుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. మెగా వేలంకు ముందు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ విడిచి పెట్టిన విషయం తెలిసిందే. అట్టిపెట్టుకోవాలని ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా చూసినా.. అందుకు రాహుల్ ఒప్పుకోలేదట. ఏదేమైనా మెగా వేలంలో రాహుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అభిమానుల కోసం తాజాగా బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)…