ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉంది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ విక్రయ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఐపీఎల్ 2026కి ముందే ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉందని డియాజియో పీఎల్‌సీకి చెందిన భారత అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్‌ఎల్) బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)కి ఓ లేఖ రాసింది. ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం…