ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ అవసరం లేకుండానే… డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం త్వరలో రాబోతోంది. ఈ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో యూపీఐ ఆధారిత ఉత్పత్తులను ఫీచర్ ఫోన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు. చిన్న మొత్తాల లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు ఆర్బీఐ గవర్నర్. ఇది ఇలా ఉండగా… కీలక వడ్డీ రేట్లు రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌నే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చింది.. ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించింది ప్రభుత్వం.. శక్తికాంత దాస్ పునర్‌నియామకాన్ని కేబినెట్ పునర్నియామక కమిటీ ఆమోదించింది. కాగా, ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న శక్తికాంత్ దాస్ పదవి కాలం ఈ ఏడాది డిసెంబర్ 10 తేదీతో ముగిసిపోనుంది.. కానీ, ఆయనను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఈ నిర్ణయం…