Banking Liquidity: ఆగస్టు నెలలో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ గణనీయంగా తగ్గి పోయిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో (ఆగస్టు 2న) బ్యాంకింగ్ లిక్విడిటీ 2. 86 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఆగస్టు 16వ తేదీ నాటికి 1.55 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిపోయింది.