రాష్ట్రమంతా రాజకీయం ఒక తీరున ఉంటే.. ఈ మూడేళ్లలో రాజోలు పాలిటిక్స్ మాత్రం ప్రత్యేకం. రాష్ట్రంలో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇదే. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చాలా వేగంగా వైసీపీకి జైకొట్టేశారు. అప్పటి నుంచి మూడేళ్లుగా రాజోలు వైసీపీ రాజకీయం చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది. ఇంఛార్జులు మారిపోయారు. నేతల మధ్య సఖ్యత లేదు. ఒకరంటే ఒకరికి పడదు. ఈ గొడవల మధ్య ఇన్నాళ్లూ ఉగ్గబట్టి ఉన్న వైసీపీ నేతలు కొందరు.. ఇక ఇమడలేక గుడ్‌బై…
రాజోలు వైసీపీలో మళ్లీ ఆధిపత్య పోరు పీక్‌కు చేరుకుంది. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న నాయకుడికి పదవి రావడంతో ఆయన జూలు విదిలిస్తున్నారు. మధ్యలో నా సంగతేంటని పార్టీ ఇంఛార్జ్ హూంకరింపులు మామూలే. ఇంకోవైపు అధికారపార్టీకి సపోర్ట్‌గా నిలిచిన ఎమ్మెల్యే ఎత్తుగడలు. మొత్తంగా ఈ మూడు ముక్కలాట పంచాయితీ తాడేపల్లి చేరుకుందనే చర్చ జరుగుతోంది. మరి అక్కడైనా పరిష్కారం లభిస్తుందా? రాజోలు వైసీపీలో మూడు ముక్కలాట! తూర్పుగోదావరి జిల్లా రాజోలు వైసీపీలో నెలకొన్న ఆధిపత్య పోరు అధిష్ఠానం పెద్దల…