కరోనా సెకండ్ వేవ్ కారణంగా మన స్టార్ హీరోలు దాదాపు మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు దాని ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో ఆగిన ప్రాజెక్ట్స్ ను మళ్ళీ పట్టాలెక్కించడం మొదలెట్టారు. ఆరోగ్యానికి అత్యధికంగా ప్రాధాన్యమిచ్చే మాస్ మహరాజా రవితేజా తన ‘ఖిలాడీ’ చిత్రం షూటింగ్ కు ఆమధ్య కామా పెట్టాడు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడటంతో తిరిగి వచ్చేవారంలో షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. అలానే ఇటీవల రచయిత శరత్ మండవ…