మాస్ మహారాజ రవితేజ- సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన మేకర్స్ సంక్రాంతి పర్వదినాన ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. జనవరి 14న ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక ఈ పూజకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా…
‘క్రాక్’ సక్సెస్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ దశలో ఉంది. రవితేజ 70వ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. దీనికి ఇప్పటికే ‘రావణాసుర’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సినిమా అభిమానుల్లో…