Ration Mafia: నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న రేషన్ మాఫియా కూటమిలో కుంపటి రాజేసింది. సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యంతో రేషన్ మాఫియా చెలరేగుతుందని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ శాఖలో రాజకీయ దుమారం రేపాయి. పార్టీకి ఎవరు చెడ్డ పేరు తీసుకొచ్చిన సహించను అంటూ అయన వ్యాఖ్యలు చేశారు. దీంతో నెల్లూరు రేషన్ మాఫియాలో కింగ్ పింగ్ గా ఉన్న సివిల్ సప్లై రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్…
Off The Record: నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కలకలం రేపుతోంది. ఏకంగా పౌర సరఫరాల శాఖలోని విజిలెన్స్ అధికారుల సహకారంతోనే అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడన్న వార్తలు జిల్లా టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. నియోజకవర్గానికో దళారిని పెట్టుకుని.. జిల్లా కేంద్రంలో రీసైక్లింగ్ చేసి మరీ దందా నడిపిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మాఫియా వ్యవహారాలు మొత్తం… ఓ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారినా, పాలకుల విధానాలు మారిపోయానా.... కాకినాడలో రేషన్ మాఫియా తీరు మాత్రం మారలేదట. మేమింతే.... అడ్డొచ్చేదెవడహే....అంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. డైరెక్ట్‌గా డీలర్ల నుంచే ఎత్తేసి డంప్ చేసుకుంటున్నారట. బియ్యం ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడికి వెళ్లాలనే లెక్కలన్నీ ఒకటో తేదీ నుంచే తయారు అయిపోతున్నాయట.
Ration Mafia : ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సిట్ రంగంలోకి దిగింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా పై సిట్ ఏర్పాటైంది. దీంతో మాఫియా గుండెల్లో గుబులు మొదలయ్యాయి. ప్రస్తుతం స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాలను పరిశీలిస్తూ సిట్ విచారణ వేగంగా సాగే అవకాశముంది. అక్రమాలకు అండదండగా ఉన్న పెద్దలపాత్ర త్వరలో బయటపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టులలోనూ కాకినాడ పోర్టు వివాదాలతో చిక్కుకుంది. కాకినాడ…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న బియ్యం అక్రమ రవాణా కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. కాకినాడ తీరంలో రేషన్ బియ్యంతో స్టెల్లా నౌక పట్టుబడటం, అక్రమ రవాణా వెనుక యంత్రాంగం అలసత్వం, మాఫీయాను మించిన నెట్వర్క్ ఏర్పడిపేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్న తీరుపై సీరియస్ అయ్యింది. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత సమగ్ర విచారణ కోసం CBCID కి అప్పగించాలని నిర్ణయించింది. రే
Nadendla Manohar: త్వరలోనే 41 A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.
రేషన్ మాఫియా రూట్ మార్చిందా..? చిన్నచిన్న వాహనాల్లో అయితే ఈజీగా దొరికేస్తామని ఏకంగా రైళ్లలోనే అక్రమ రవాణాకు తెగిస్తున్నారా..? రాష్ట్ర సరిహద్దులు లేదా జిల్లా సరిహద్దుల్లో గోదాముల్లో నిల్వ చేసి రాత్రికి రాత్రే రాష్ట్రాలు దాటిస్తున్నారా..? అంటే అవుననే స్పష్టం అవుతోంది.. కొమురం భీం జిల్లా సిర్పూర్ టి రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా పీబీఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అందించే పీడీఎస్ బియ్యాన్ని కొందరు దళారులు అక్రమమార్గం…