Ponnam Prabhakar : ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో గత దశాబ్దంగా రేషన్ కార్డుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. మార్చి 1వ తేదీన లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆయన వెల్లడించారు. మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి,…
మీసేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. మీసేవ ద్వారా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే "మీసేవ"ను కోరినట్లు పౌరసరఫరాల శాఖ కమిషన్ డీఎస్ చౌహాన్ తెలిపారు.
Free Ration: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉచిత రేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గోధుమలు, బియ్యంతో పాటు చక్కెరను ఉచితంగా అందజేస్తామని ప్రకటించినా, కొంతమంది ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది.