Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మంచి వార్తను అందిస్తోంది. రానున్న వర్షాకాలంలో ప్రజలు తిండికి, రేషన్ సరుకులకు ఇబ్బందులు పడకుండేందుకు ముందుగానే పెద్దసెరిగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. వర్షాకాలంలో సాధారణంగా భారీ వర్షాలు, వరదలు, రవాణా అంతరాయం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జూన్, జులై, ఆగస్ట్ నెలలకు అవసరమయ్యే రేషన్ సరుకులను ముందుగానే ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేషన్ షాప్‌లో రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో నేడు 17,263 చాకధరల దుకాణాల ద్వారా 2 లక్షల 91 వేలకు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్నపు బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో తీసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి లేదంటే చౌక ధరల దుకాణదారుకే…
కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంతో రేషన్‌కార్డు ఉన్నవారికే లబ్ధిచేకూరనుంది.. ఎందుకంటే.. రాష్ట్ర ప్రజలకు పౌరసరఫరాల శాఖ.. కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది. నెల వ్యవధిలోనే రెండు సార్లు కందిపప్పు ధరలను తగ్గించారు.
Free Rice:కొత్త సంవత్సరం వచ్చేసింది.. జనవరి నెల ప్రారంభమై 10 రోజులు గడిచినా.. సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రేషన్ పంపిణీ చేయడం లేదు ఏంటి? అంటూ రేషన్‌కార్డు దారులు అంతా ఎదురుచూస్తున్నారు.. సాధారణంగా 5వ తేదీ నుంచి డీలర్లు బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు.. కానీ, ఈ నెల మాత్రం 10వ తేదీ దాటినా బియ్యం పంపిణీ ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వెళ్లువెత్తాయి.. ఈ సమయంలో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. నేటి నుంచి…
సంక్రాంతి పండుగ వేళ ప్రజలకు శుభవార్త చెప్పారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. సంక్రాంతి పండుగ సందర్భంగా పొంగల్ గిఫ్ట్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.. రేషన్ కార్డ్ దారులకు వెయ్యి రూపాయల నగదు పాటు.. ఒక కేజీ చక్కెర, కేజీ బియ్యం కానుకగా అందిస్తున్నారు.. తమిళనాడులోని 2.19 కోట్లమందికి ఈ పండుగకు ప్రయోజనం చేకూరనుంది.. రేషన్ కార్డ్ హోల్డర్లు అందరూ దీనికి అర్హులు.. ఇది శ్రీలంక పునరావాస శిబిరాల్లో నివసిస్తున్న కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. ఒక్కో కేజీ బియ్యం,…
మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీకు శుభవార్త… ఇవాళ్టి నుంచి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తున్నారు.. తెలంగాణలో ఇవాళ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించారు… డిసెంబర్ వరకూ 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందించనుంది ప్రభుత్వం.. రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చే బియ్యానికి అదనంగా మరో ఐదు కిలోలు కలిపి మొత్తం ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామని…