రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. టాటా కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఐటీ విభాగాన్ని సంస్థకు మూలస్తంభంగా మార్చారు. తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రతన్ టాటా.. వయో సంబంధిత సమస్యలతో బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రముఖులు అందరూ ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే అమెరికాలో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రతన్.. భారత్‌కు రావాలని అనుకోలేదు.…