Rashmika Mandanna deepfake: నటి రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో గతేడాది సంచలనంగా మారింది. బ్రిటిష్ ఇన్‌ఫ్లూయెన్సర్ జరా పటేల్ వీడియోకి రష్మికా ముఖాన్ని మార్ఫింగ్ చేసి రూపొందించిన ఈ వీడియోపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ దుర్వినియోగంపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ వీడియో మార్ఫింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Rashmika Mandanna: నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా వివాదం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కఠిన చట్టాలు తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఐటీ చట్టంలో కఠిన నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు.