కన్నడ సోయగం రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇటీవల “మిషన్ మజ్ను” చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో సిధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. రష్మిక తన సెకండ్ బాలీవుడ్ మూవీలో బిగ్ బిఅమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ పంచుకుంటుంది. ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్‌తో కలిసి “పుష్ప” అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా కార్తీ సరసన “సుల్తాన్”లో నటించి కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. అయితే తాజాగా రష్మిక మరో కోలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనుందట. అది కూడా సెన్సేషనల్ స్టార్ హీరో తలపతి విజయ్ సరసన అట.
Read Also : కరీనా ‘సీత’ వివాదం… తప్పేంటి ? అంటున్న తాప్సి
తాజా ఇన్‌స్టాగ్రామ్ సెషన్ లో రష్మిక తన అభిమానులను ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనేసరికి ఓ అభిమాని ‘తలపతి విజయ్ తో మీరు నటించే అవకాశం ఉందా ?’ అని ప్రశ్నించాడు. “అతి త్వరలో” అంటూ సమాధానమిచ్చింది రష్మిక. మరో నెటిజన్ ‘విజయ్ గురించి మీ అభిప్రాయం ?’ అని ప్రశ్నించగా… ‘లవ్’ అంటూ లవ్ సింబల్ ను షేర్ చేసింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా ‘బీస్ట్’ తెరకెక్కుతోంది. పాన్ ఇండియన్ నటి పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా… సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అయితే ఇందులో పూజాహెగ్డేను హీరోయిన్ గా ప్రకటించకముందు రష్మిక పేరు విన్పించింది. ఇక తాజాగా విన్పిస్తున్న మరో వార్త ఏమిటంటే ‘బీస్ట్’లో మరో హీరోయిన్ పాత్రకు అవకాశం ఉందట. ఈ పాత్ర కోసం మేకర్స్ రష్మికతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. మరి రష్మిక చహింట్ ఇచ్చింది ‘బీస్ట్’ గురించేనా ? లేకపోతే విజయ్ తో మరో సినిమాలో కలిసి నటించబోతోందా ? అనేది చూడాలి.