యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. హీరో రామ్ పోతినేని, విలన్ ఆది పినిశెట్టి తెలుగువాళ్ళైతే, దర్శకుడు లింగుస్వామి తమిళియన్. చిత్రం ఏమంటే… ఇటు రామ్ సరసన, అటు ఆది సరసన నటిస్తున్న ఇద్దరు అందాల భామలు కన్నడిగలు. ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న కృతీశెట్టి……
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “రాపో19″లో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో యూనిట్ టాకీ పోర్షన్‌ను చిత్రీకరిస్తోంది. తాజా అప్డేట్ ఏమిటంటే “రాపో19” ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయట. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ రామ్ పోతినేని నటిస్తున్న ఈ సినిమా ఆడియో హక్కుల కోసం ఏకంగా రూ.2.75 కోట్లు ఖర్చు…
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేశారు. పూర్తిస్థాయి మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని “రాపో19” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రామ్ కెరీర్‌లో అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో “రాపో19” ఒకటి. ఇది ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో…
ప్రస్తుతం టాలీవుడ్ లో కృతి శెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. “ఉప్పెన” చిత్రంతో తెరంగ్రేటం చేసిన ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్ లో అపారమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ పోతినేని “రాపో19″లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆమె నానితో పాటు “శ్యామ్ సింగ రాయ్” చిత్రం కూడా చేస్తోంది. అంతేకాకుండా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు…
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని తన తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రబృందం ఇటీవలే సినిమా షూటింగ్ ను ప్రారంభించింది. మొదటి షెడ్యూల్‌లో రామ్, నదియాలతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తాజాగా సెట్స్ లో నుంచి నదియా ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు మేకర్స్. అందులో ఆమె సాధారణ పసుపు చీర, నీలం రంగు జాకెట్టు, గ్లాసెస్ ధరించి సౌమ్యంగా కన్పిస్తోంది. పిక్ చూస్తుంటే సాదాసీదాగా కన్పిస్తున్న…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. కానీ షూటింగ్స్ హంగామా మాత్రం మామూలుగా లేదు. స్టార్ హీరోస్ సినిమాల నుండి యంగ్ హీరోస్ మూవీస్ వరకూ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులైతే మార్నింగ్ ఒక షూటింగ్ లోనూ ఈవినింగ్ మరో షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. కొన్ని చిత్రాల షూటింగ్స్ రాత్రిళ్ళు కూడా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ లో అయితే ఈ మూల కోకాపేట నుండి ఆ మూల ఫిల్మ్ సిటీ వరకూ ఒకటే…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, తమిళ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో ఓ బహు భాషా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమా…
తమిళ చిత్ర పరిశ్రమలో కాపీ వివాదాలు సర్వ సాధారణం అయిపోయాయి. గతంలో ఎ.ఆర్.మురుగదాస్, శంకర్ వంటి దర్శకులు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పందెం కోడి’ ఫేమ్ లింగుసామి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. లింగుసామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆ మూవీపై మరో తమిళ దర్శకుడు సీమాన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోలీవుడ్ మీడియా కథనం ప్రకారం లింగుసామి…
దర్శకుడు లింగుసామిదర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ ద్విభాషా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న లింగుసామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం రూపొందనుందని ప్రకటించారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఆ రూమర్స్ పై మాధవన్ స్పందించాడు. “లింగుసామితో వర్క్ చేయడానికి,…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుసామితో చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ‘రాపో19’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. లింగుస్వామికి తెలుగులో ఇదే తొలి చిత్రం. గతంలో ఆయన విశాల్…