యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. హీరో రామ్ పోతినేని, విలన్ ఆది పినిశెట్టి తెలుగువాళ్ళైతే, దర్శకుడు లింగుస్వామి తమిళియన్. చిత్రం ఏమంటే… ఇటు రామ్ సరసన, అటు ఆది సరసన నటిస్తున్న ఇద్దరు అందాల భామలు కన్నడిగలు. ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న కృతీశెట్టి… రామ్ సరసన నటిస్తోంది. ‘మన్మథుడు -2’లో తళుక్కున కాసేపు మెరిసిన అక్షర గౌడ… ఆది పినిశెట్టితో జోడీ కడుతోంది.
Read Also : ‘ఐకాన్’ స్టార్ తో ఆ ఇద్దరి రొమాన్స్!
ఇదిలా ఉంటే… ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు లింగు స్వామి సహనాన్ని హీరోయిన్ కృతీశెట్టి ఇటీవల పరీక్షించిందట. కృతీశెట్టి, నాజర్ పై కొన్ని సెంటిమెంట్ సీన్స్ ను దర్శకుడు లింగుస్వామి షూట్ చేస్తుంటే… సరైన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో కృతీ ఫెయిల్ అయినట్టుగా తెలుస్తోంది. ఓ చిన్న సీన్ తీయడానికి దాదాపు గంట సమయం పట్టిందట. నాజర్ లాంటి సీనియర్ వ్యక్తితో సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో కాస్తంత ముందే హావభావాలను ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేదని యూనిట్ సభ్యులు భావించారట. ఒకానొక సమయంలో ఆవేశాన్ని అదుపు చేసుకోలేక లింగుస్వామి కృతీశెట్టిపై అరిచారని తెలిసింది. ఏదేమైనా నాజర్ లాంటి సీనియర్ నటుడి ముందు నిలబడి నటించడం అంటే మాటలు కాదు… కానీ విజయ్ సేతుపతితోనే ‘ఉప్పెన’లో ఢీ అంటే ఢీ అంటూ నటించింది కృతీశెట్టి! మరి అలాంటి అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యిందో తెలియదు!!