దర్శకుడు లింగుసామిదర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ ద్విభాషా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న లింగుసామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం రూపొందనుందని ప్రకటించారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఆ రూమర్స్ పై మాధవన్ స్పందించాడు. “లింగుసామితో వర్క్ చేయడానికి, మ్యాజిక్ ను రిక్రియేట్ చేయడానికి ఇష్టపడతాను. ఆయన అద్భుతమైన వ్యక్తి… కానీ ఆయన తెలుగు చిత్రంలో నేను విలన్ గా నటిస్తున్నాను అంటూ ఇటీవల కాలంలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు మాధవన్. అంతకుముందు దర్శకుడు లింగుసామితో కలిసి మాధవన్ “వెట్టై”లో పనిచేశారు. ఇది 2012లో విడుదలైంది. ఈ చిత్రంలో ఆర్య, సమీరా రెడ్డి , అమలా పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం మాధవన్ “రాకెట్ట్రీ: ది నంబి ఎఫెక్ట్” విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ ‘రాకెట్ట్రీ’ చిత్రం రూపొందుతోంది.