రామ్ కూడా మొదలు పెట్టేశాడు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, తమిళ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో ఓ బహు భాషా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని మేకర్స్ ప్రకటించారు. హైదరాబాద్ లో నేటి నుంచి “రాపో19” షూటింగ్ జరుపుకోనుంది.
Read Also : రజినీకాంత్ షాకింగ్ నిర్ణయం… ఇకపై నో పాలిటిక్స్… !
Also Read
ఈ సినిమా ద్వారా రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. లింగుస్వామికి తెలుగులో ఇదే తొలి చిత్రం. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన విశాల్ ‘పందెంకోడి’ తెలుగులో కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. కాగా “ఇస్మార్ట్ శంకర్”తో భారీ విజయాన్ని అందుకున్న రామ్, ఆ తరువాత “రెడ్” మూవీతో డిజాస్టర్ ను చవి చూశాడు. మరి ఈ చిత్రం రామ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్‌ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!